మదనపల్లి, అక్టోబర్ 22: మదనపల్లి మున్సిపాలిటీ 15వ వార్డులో కూటమి పార్టీల కౌన్సిలర్ అభ్యర్థి సిరివేలు చరణ్ కుమార్కు మద్దతుగా కూటమి నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.**
ఈ ప్రచారంలో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి, మదనపల్లి మున్సిపల్ కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ కుమార్ (చినబాబు), శ్రీకృష్ణ గ్రూప్స్ అధినేత మార్పూరి శశిధర్ రావు, ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం, సీడ్ మల్లికార్జున నాయుడు, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ రవికాంత్, పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల అరుణ్ తేజ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారిందని విమర్శించారు. ప్రజలు వైసీపీ పాలనను తిరస్కరించి ఆ పార్టీని 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేశారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలుతో ప్రజలకు ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు.
అనంతరం 15వ వార్డు కూటమి అభ్యర్థి సిరివేలు చరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో కొనసాగుతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
తనను 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా, శ్రీరామ్ కుమార్ (చినబాబు)ను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాటకొండ గగన్, మండ్యం ప్రభాకర్, గడ్డం లక్ష్మీపతి, జనసేన పార్టీ టౌన్ సెక్రటరీ జనార్ధన్, పద్మావతి, విద్యాసాగర్, మహబూబ్ ఖాన్, బోనాల ఉమేష్, మల్లూరు సునీత, ఎం. వేమయ్య తదితరులు పాల్గొన్నారు.
