రామసముద్రం: మదనపల్లి నియోజకవర్గంలోని రామసముద్రం మండల కేంద్రంలో మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియ, నామినేషన్ల సరళిపై ఆరా తీశారు. స్థానిక నాయకులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.

