మదనపల్లె నియోజకవర్గం రూరల్ మండలంలోని బసినికొండ 1, 2 పంచాయతీల పరిధిలో కూటమి అభ్యర్థుల తరఫున జనసేన పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్ గంగారపు రాందాస్ చౌదరి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ జడ్పీటీసీ కూటమి అభ్యర్థి కొప్పల రమ్యకు గాజు గుర్తుపై, ఎంపీటీసీ అభ్యర్థులు నారప్పగారి శారద, రెడ్డి శేఖర్‌లకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం, బీపీఎల్ విజయ్ కుమార్, బొమ్మనచెరువు శ్రీవాసులు, యుగంధర్, రూరల్ అధ్యక్షుడు రోణూరు బాబు, జనసేన సీనియర్ నాయకుడు తోట కళ్యాణ్, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడప సురేంద్ర, లక్ష్మీనారాయణ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.

