నిమ్మనపల్లి, రామసముద్రం జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత

మదనపల్లె: మదనపల్లె నియోజకవర్గ పరిధిలోని నిమ్మనపల్లి, రామసముద్రం మండలాల జెడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా బీ-ఫారాలు అందజేశారు.

పార్టీ ఆదేశాల మేరకు మంగళవారం మదనపల్లెలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నిమ్మనపల్లి మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా మునిరత్నకు, రామసముద్రం మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా కృష్ణంరాజు సతీమణి సుజాతమ్మకు ఎమ్మెల్యే బీ-ఫారాలు అందించారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియతో పాటు ఎన్నికలకు సంబంధించిన నిబంధనలను పాటిస్తూ ముందుకు సాగాలని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *