మదనపల్లె: మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) విభాగం, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ (ఐఈటీఈ), ఇండస్ట్రీ రిలేషన్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల జాతీయ స్థాయి సాంకేతిక వర్క్‌షాప్ నిర్వహించారు.
‘సిలికాన్ టు ఏఐ ఇంటెలిజెన్స్: బ్రిడ్జింగ్ వీఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ స్మార్ట్ టెక్నాలజీస్’ అనే అంశంపై నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో బెంగళూరుకు చెందిన మావెన్ సిలికాన్ సంస్థ ప్రతినిధులు చీఫ్ బిజినెస్ ఆఫీసర్ హిమాన్షు మట్టా, హెడ్ – అకాడెమియా బిజినెస్ విజయ్‌కుమార్ కన్నూర్, సీనియర్ ట్రైనర్ డాక్టర్ భట్టాచార్య, సీనియర్ మేనేజర్ – అకాడెమియా బిజినెస్ హర్షిత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హిమాన్షు మట్టా మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక యుగంలో వీఎల్ఎస్ఐ, సెమీకండక్టర్ టెక్నాలజీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, కృత్రిమ మేధ (ఏఐ), స్మార్ట్ టెక్నాలజీలకు విస్తృత ప్రాధాన్యత ఉందన్నారు. చిప్ డిజైన్ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, సెమీకండక్టర్ పరిశ్రమలో నూతన ఆవిష్కరణలు, ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో ఏఐ అనుసంధానం, భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న ఉద్యోగ, పరిశోధనా అవకాశాలను వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
వర్క్‌షాప్ మొదటి రోజున మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ ఐ. తిరునావుక్కరసు ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ప్రిడిక్టివ్ అల్గారిథమ్స్, ఎడ్జ్ ఎఫ్‌పీజీఏ సాంకేతికతల ప్రాధాన్యత, పైలట్ ప్లాంట్ రియాక్టర్లలో వాటి వినియోగం, ఆచరణాత్మక అనువర్తనాలను వివరించారు.
రెండవ రోజున మిట్స్ పూర్వ విద్యార్థి, బెంగళూరులోని బ్రాడ్‌కామ్ సంస్థలో ఐసీ డిజైన్ వెరిఫికేషన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న యువ ప్రసాద్, లీడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ జైశంకర్ నాగరి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సెమీకండక్టర్ చిప్స్, వీఎల్ఎస్ఐ డిజైన్, CMOS టెక్నాలజీ, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పరిశ్రమల్లో ఈ నైపుణ్యాలకు ఉన్న ప్రాధాన్యత, ఉద్యోగ అవకాశాలను వివరించారు.
మూడు రోజుల వర్క్‌షాప్‌లో భాగంగా వీఎల్ఎస్ఐ, సిస్టమ్ ఆన్ చిప్ (SoC), ASIC, SSI, MSI, LSI, VLSI వంటి చిప్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీల పరిణామ క్రమం, 2 నానోమీటర్ టెక్నాలజీతో సహా సెమీకండక్టర్ రంగంలో తాజా ఆవిష్కరణలపై విస్తృతంగా చర్చించారు. వీఎల్ఎస్ఐ డిజైన్‌లో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ప్రక్రియలు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఐసీ రీడింగ్ వంటి అంశాలను సాంకేతిక ఉదాహరణలతో వివరించారు. ఎంబెడెడ్ సిస్టమ్స్, స్మార్ట్ టెక్నాలజీల్లో ఏఐ అనుసంధానం ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, పారిశ్రామిక రంగాల్లో వస్తున్న మార్పులను విద్యార్థులకు పరిచయం చేశారు.
ఈ కార్యక్రమంలో మిట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ సి. గోరె, అసిస్టెంట్ డైరెక్టర్ – ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎం. బాలాజీ, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి. నాగశ్వేత, వర్క్‌షాప్ కోఆర్డినేటర్లు డాక్టర్ రెడ్డి హేమంత, రేవతి, జి. చరణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


