జనసేన అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత

మదనపల్లె: జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి, స్థానిక సంస్థల ఎన్నికల రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేశారు.

ఈ సందర్భంగా నిమ్మనపల్లె మండలం ముస్తూరు పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థిగా జి. మాలతి, రామసముద్రం మండలం ఊలపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా ఎం.జి.పి. వినోద్, రామసముద్రం పంచాయతీ ఎంపీటీసీ-2 అభ్యర్థిగా పి. సూరి, మదనపల్లె రూరల్ కొల్లబైలు-1 ఎంపీటీసీ అభ్యర్థిగా ఆర్. రాజరెడ్డి, సీటీఎం క్రాస్‌రోడ్డు ఎంపీటీసీ-1 అభ్యర్థిగా ఉప్పు వెంకట శివ, కొత్తకోట జెడ్పీటీసీ అభ్యర్థిగా చందన, మదనపల్లె జెడ్పీటీసీ అభ్యర్థిగా కొప్పుల రమ్య, తట్టివారిపల్లె ఎంపీటీసీ అభ్యర్థిగా పి. రమణమ్మలకు బి-ఫారాలు అందజేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *