🚨 సినిమా రేంజ్‌లో చేజింగ్.. ఎర్రచందనం వాహనం పట్టివేత!

పీలేరు ఫారెస్ట్ ప్లేయింగ్ స్క్వాడ్‌ను తప్పించుకునేందుకు డ్రైవర్ పరారీ

అన్నమయ్య జిల్లా | పీలేరు నియోజకవర్గం :సెప్టెంబర్:4

పీలేరు ఫారెస్ట్ ప్లేయింగ్ స్క్వాడ్ అధికారులు సినిమా రేంజ్‌లో చేజింగ్ చేసి ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన పులిచెర్ల మండలంలో చోటుచేసుకుంది.

పులిచెర్ల మండలం కల్లూరు వద్ద పీలేరు ఫారెస్ట్ బీట్ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ జైలో వాహనం అతివేగంగా దూసుకొచ్చింది. అనుమానం వచ్చిన అధికారులు వాహనాన్ని వెంబడించారు.

కల్లూరు బస్టాండ్ సర్కిల్‌ నుంచి ప్రారంభమైన చేజింగ్ కల్లూరు ఘాట్ వరకు కొనసాగింది. ఘాట్ వద్దకు చేరుకునే సమయంలో వాహనం టైర్ విడిపోవడంతో డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారైనట్లు అధికారులు తెలిపారు.

అనంతరం వాహనాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో ఎర్రచందనం దుంగలతో పాటు ఎర్రచందనం నరికేందుకు ఉపయోగించే సామాగ్రి ఉన్నట్లు గుర్తించారు.

వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. పరారైన డ్రైవర్ కోసం గాలింపు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అటవీ శాఖ అధికారులు వెల్లడించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *