మదనపల్లె సెప్టెంబర్ 4:జగద్గురు భగవాన్ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని మదనపల్లె పట్టణంలోని అనపగుట్ట గోవర్ధనగిరిపై వెలసిన శ్రీకృష్ణ ఆలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఎస్. నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు. అలాగే రాష్ట్రంలో కరువుకాటకాలు తొలగిపోయి, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి 2029లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, రాష్ట్రంలో సంక్షేమ పాలనను పునరుద్ధరించాలని శ్రీకృష్ణ స్వామివారిని ప్రార్థించినట్లు నిసార్ అహ్మద్ తెలిపారు.
శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా ధర్మం, న్యాయం, సత్యం వైపు ప్రజలకు మార్గనిర్దేశం చేశారని, ఆయన ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు రావాలని ఆకాంక్షించారు. కృష్ణాష్టమి పర్వదినం ప్రజల జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, సంతోషం నింపాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు అనూషా రెడ్డి, జింకా చలపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ మనుజా రెడ్డి, ఎస్ వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి, మాజీ సర్పంచ్ వలసపల్లి నాగరాజ రెడ్డి, ముజీబ్, శీలం రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ గురుశంకర్ యాదవ్, సభ్యులు రెడ్డెప్ప యాదవ్, శంకర్ యాదవ్, బాలచంద్ర యాదవ్ , మహేశ్ యాదవ్ , చలపతి యాదవ్, అమరనాథరెడ్డి, కొత్తపల్లి నాగార్జున నాయుడు, ఆవుల విశ్వనాథ్, శారదా రెడ్డి, వినుత బాయి, ముజీబ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
