ముదివేడు టోల్‌ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

టమాటా లారీ ఢీకొని బైక్‌పై వెళ్తున్న యువకుడు దుర్మరణం

కురబలకోట, ఆగస్టు 11: (gtvmedia)అన్నమయ్య జిల్లా కురబలకోట మండల పరిధిలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముదివేడు టోల్‌ ప్లాజా సమీపంలో టమాటా లారీ బైక్‌ను ఢీకొని కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నగొట్టిగల్లుకు చెందిన ఎలక్ట్రీషియన్ వినోద్ కుమార్ (20) మంగళవారం బైక్‌పై ములకలచెరువు మండలం చౌడసముద్రంలోని తన అక్క వద్దకు వెళ్తున్నాడు. తంబళ్లపల్లి మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ముదివేడు టోల్‌ ప్లాజా సమీపంలో టమాటా లారీ అతని బైక్‌ను ఢీకొట్టింది.

ప్రమాదంలో లారీ బైక్‌ను కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో వినోద్ కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంపై పోలీసులు విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *