మదనపల్లె, ఆగస్టు 11: (gtvmedia)మదనపల్లె పట్టణంలోని టౌన్ రింగ్ రోడ్డు సర్కిల్ వద్ద మంగళవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా గుజరీ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దుకాణంలోని సామగ్రి కాలిపోయి యజమానులకు నష్టం వాటిల్లింది.
సమాచారం తెలుసుకున్న మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిప్రమాదానికి గురైన దుకాణాన్ని పరిశీలించారు. అనంతరం బాధిత దుకాణ యజమానులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అగ్నిప్రమాదం కారణంగా జరిగిన నష్టంపై అధికారులతో మాట్లాడి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధితులకు అవసరమైన సహాయం, నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా బాధితులు తమకు జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత అధికారులు కూడా ఘటనపై వివరాలను సేకరించి తదుపరి చర్యలు చేపట్టారు.
