మదనపల్లె, ఆగస్టు 12:( gtvmedia)కర్ణాటకలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు.
మదనపల్లె పట్టణానికి చెందిన మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు కుమారుడు కంచర్ల మధు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు చింతామణి పోలీసులు నిర్ధారించారు.
ప్రమాదంలో మధు మృతి చెందిన విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే మృతుని కుటుంబ సభ్యులు కర్ణాటకకు బయలుదేరి వెళ్లారు.
ఈ ఘటనతో మదనపల్లెలోని కంచర్ల శ్రీనివాసులు నాయుడు కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
