ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లి: సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలోని నిమ్మనపల్లి రోడ్డులో ఉన్న ఎస్.ఆర్.కె. కళ్యాణ మండపంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి మదనపల్లి శాసనసభ్యులు ఎం. షాజహాన్ బాషా, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి, ఉత్తమ ఉపాధ్యాయుల ప్రశంసాపత్రాలను అందజేశారు.

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ వారిని సత్కరించడం ద్వారా వారి సేవలకు గౌరవం కల్పించినట్లు తెలిపారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు కూడా పాల్గొన్నారు. దీంతో ఎస్.ఆర్.కె. కళ్యాణ మండపం సందడిగా మారింది.

