రామచార్లపల్లిలో ఇంటింటా టీడీపీ ప్రచారం

మదనపల్లి, ఆగస్టు 16: (gtvmedia)రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, మదనపల్లి శాసన సభ్యులు షాజహాన్ బాషసూచనలతో మదనపల్లి మండలం రామచార్లపల్లి పంచాయతీలో టీడీపీ నాయకులు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని నాయకులు తెలిపారు.

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని వారు సూచించారు.

ఈ కార్యక్రమంలో శీతక యుగంధర్, జి. పద్మనాభం, బూత్ కన్వీనర్ ఆర్. లోకేష్, ఎం. గురు, శీతక జయప్రతాప్, బూత్ కన్వీనర్ చాంద్ బాషా, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *