వారోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ప్రదర్శన..
సీనియర్ సభ్యులకు ఘన సన్మానం
మదనపల్లె, ఆగస్టు 16: (gtvmedia)
మానవతా సంస్థ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మదనపల్లె పట్టణంలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సంస్థకు చెందిన 40 మంది సభ్యులు పాల్గొని, శాంతి సందేశాన్ని చాటిచెప్పారు.
ఈ సందర్భంగా మానవతా సంస్థ సీనియర్ సభ్యులు బి.నారాయణ రెడ్డి, బీటి నరసింహులు, శంకరప్ప నాయుడు, హరినాధ బాబు, సంస్థ కన్వీనర్ సి.భాస్కర్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు.
మానవతా సంస్థ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు జామకాయల కృష్ణమూర్తి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మదనపల్లి చైర్మన్ రాటకొండ గురు ప్రసాద్, అధ్యక్షుడు సూర్య ప్రకాశ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరినాధ బాబు, కన్వీనర్ భాస్కర్ రెడ్డి, కోశాధికారి రామ్మూర్తి, డైరెక్టర్లు సుధాకర్ రెడ్డి, నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, సీనియర్ సభ్యులు రమణప్ప, వీరంరెడ్డి, వెంకటరమణ, రామకృష్ణారెడ్డి, ఆత్మీయ సహకార కో చైర్మన్ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.
