మదనపల్లె ఆగస్టు 16:(gtvmedia)
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో, ఆదివారం మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి చేతుల మీదుగా లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా లాంటి జాతీయ ఉద్యమాల్లో లచ్చన్న వీరోచిత పోరాటాన్ని గుర్తుచేశారు.
ప్రజాసేవకు, నిజాయితీకి మారుపేరైన లచ్చన్న గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అదనపు ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ డి. ఏడుకొండల రెడ్డి, ఆర్ఐ యు. రంగనాథ్ బాబు, ఆర్ఎస్ఐలు, శ్రీనివాస్, రవి, సిబ్బంది పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
