సెప్టెంబర్ 03, 2026 | మదనపల్లి
మదనపల్లి: మదనపల్లి మండలం కురువంక పంచాయతీలో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ సంక్షేమ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
