శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో మంత్రుల ప్రత్యేక పూజలు

అన్నమయ్య జిల్లా | సెప్టెంబర్ 05,

శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి , రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయానికి విచ్చేసిన మంత్రులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.

భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమంలో మంత్రులు పాల్గొనడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి, వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు, జోనల్ కోఆర్డినేటర్ దామలచెర్ల సత్య , అబ్జర్వర్ అనిత యాదవ్ తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *