మదనపల్లె, ఆగస్టు 9:( grvmedia)ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టరేట్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మదనపల్లె ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజనులకు అన్ని విధాలుగా అండగా నిలిచి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
గిరిజనుల కోసం త్వరలోనే భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గిరిజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గిరిజన వర్గాలకు మరింత ప్రయోజనం చేకూరేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, పట్టణ సీఐ రాజారెడ్డి, గిరిజన అభివృద్ధి శాఖ ఏ.డీతో పాటు పలువురు అధికారులు, గిరిజన సంఘాల నాయకులు, ప్రతినిధులు, గిరిజనులు పాల్గొన్నారు.
