టెట్‌లో 30 వేల మంది ఉపాధ్యాయులు ఉత్తీర్ణత

త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు: టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డి

అమరావతి, ఆగస్టు 29: (gtvmedia)ఈ నెలలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాల్లో దాదాపు 30 వేల మంది ఉపాధ్యాయులు ఉత్తీర్ణత సాధించినట్లు టెట్ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో పెద్ద సంఖ్యలో అర్హత సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు కృష్ణారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

టెట్ ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *