మదనపల్లి ఆగస్టు 11: (gtvmedia)మదనపల్లి పట్టణం కదిరి రోడ్డు లోని దుకాణంలో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శివకుమార్ అనే వ్యక్తి కదిరి రోడ్డులోని ప్రైవేట్ స్థలంలో గుజిరి దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం దుకాణంలోని విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ వలన మంటలు వ్యాపించాయి. దీంతో నిర్వాహకుడు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించాడు. మదనపల్లి ఫైర్ అధికారి శివప్ప ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి కుదిరి దుకాణంలోని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ అధికారి శివప్ప మాట్లాడుతూ… బాధితుడు శివకుమార్ తెలిపిన వివరాల మేరకు రూ 1.5 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశామన్నారు.

