మదనపల్లి ఆగస్టు 21: (gtvmedia)మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద లక్కీ టైల్స్ మాల్ ఆధ్వర్యంలో రూ. 35వేలతో సిమెంట్ బెంచ్ లను ఏర్పాటు చేశారు. లక్కీ టైల్స్ మాల్ యజమాని నగేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు కూర్చుని ఎందుకు చోటు లేక అవస్థలు పడుతున్నారని, దీని నివారించడానికి పది చోట్ల సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మదనపల్లి తాహసిల్దార్ కార్యాలయం, సబ్ జైలు, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. నగేష్ ను పలువురు అభినందించారు.
రూ.35వేలతో సిమెంట్ బెంచీలు ఏర్పాటు
