అనర్హులకు పథకం ప్రయోజనం దక్కకూడదు: సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి
మదనపల్లి, ఆగస్టు 11: (gtvmedia)రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నేతన్న సేవలో’ పథకంలో అనర్హులకు చోటు కల్పించకుండా, అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి అధికారులను ఆదేశించారు.

మంగళవారం నిరుగట్టువారిపల్లి సచివాలయం పరిధిలోని మగ్గాల ఇళ్లను సబ్‌కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పథకం అమలుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆమె మాట్లాడుతూ.. పథకం లబ్ధిదారుడి ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా మగ్గంపై పర్మనెంట్ మార్కర్‌తో నమోదు చేయాలని సూచించారు. ఇంటి డోర్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసి, జియోట్యాగింగ్‌తో మగ్గాల ఇళ్ల ఫొటోలను తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులు పథకం ద్వారా లబ్ధి పొందకుండా క్షేత్రస్థాయిలో అధికారులు పక్కాగా పరిశీలన చేయాలని సూచించారు. అదే సమయంలో అర్హత ఉన్న ఏ ఒక్కరూ పథకం ప్రయోజనం కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని చేనేత, జౌళిశాఖ ఏడీ పవన్‌కుమార్‌రెడ్డిని ఆదేశించారు.
కార్యక్రమంలో స్వర్ణవార్డు–స్వర్ణగ్రామ జిల్లా అధికారి అమర్నాథ్రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
