మదనపల్లి పట్టణంలో జోరు అందుకున్న ఇంటింటికి తెలుగుదేశం

మదనపల్లి ఆగస్టు 18: (gtvmedia)రాష్ట్ర టిడిపి అధిష్టానం పిలుపుమేరకు మదనపల్లి పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జోరు అందుకుంది. మంగళవారం టిడిపి పట్టణ అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్ తేజ ఆధ్వర్యంలో గొల్లపల్లి క్రాస్ రోడ్డు, ఎస్బిఐ కాలనీ బోర్డు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచారు. అరుణ్ తేజ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఇన్చార్జ్ రాజకుమార్, వార్డు సభ్యుడు శ్రీరాములు, మైనార్టీ నాయకుడు గౌస్ బాషా, తెలుగు మహిళా నాయకురాలు ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *