హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష

రాయచోటి ఆగస్టు 18: (gtvmedia)రాయచోటి పరిధిలో 2024 నాటి ఎన్నికల ప్రచార వివాదంలో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులు కాటిమాయకుంట గంగాధర్, అబ్బవరం శివరాం ప్రసాద్‌లకు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది.

ఎన్నికల ప్రచారానికి రాలేదనే కారణంతో బాధితుడు మల్లికార్జున, ఆయన కుటుంబ సభ్యులపై నిందితులు కర్రలతో తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు.

అప్పటి రాయచోటి అర్బన్ ఎస్ఐ ఎం. భక్తవత్సలం కేసు నమోదు చేసి సరి అయిన ఆధారాలతో త్వరితగతిన ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

రాయచోటి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఈ. ప్రసూన గారి ఎదుట జరిగిన విచారణలో నేరం రుజువు కావడంతో నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి ₹1,000/- జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది.

కేసును సమర్థవంతంగా నడిపించిన రాయచోటి డిఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్, రాయచోటి అర్బన్ సీఐ. బి.వి.చలపతి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి. గుర్రప్ప, సాక్షులను సకాలంలో హాజరుపరిచిన కోర్టు లైజన్ ఆఫీసర్ మస్తాన్ వలి పనితీరును అభినందిస్తూ జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *