3.6 LPA ప్యాకేజీతో 38 మంది విద్యార్థులకు ఉద్యోగావకాశాలు

మదనపల్లె, ఆగస్టు 18: (gtvmedia)ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో ప్రముఖ సంస్థ QSpiders 38 మంది విద్యార్థులను ఇంటర్న్‌షిప్, ఉద్యోగావకాశాలకు ఎంపిక చేసింది. ఎంపికైన విద్యార్థులకు రూ.3.6 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ (3.6 LPA) అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిభ, కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. 38 మంది విద్యార్థులకు ఉద్యోగ, ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభించడంతో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డా. ఎస్. రామలింగారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఉద్యోగానికి అవసరమైన శిక్షణ అందించడంపై కళాశాల ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. QSpiders సంస్థలో 38 మంది విద్యార్థులు ఎంపిక కావడం విద్యార్థుల ప్రతిభతో పాటు అధ్యాపకుల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.

భవిష్యత్తులో మరిన్ని ప్రముఖ సంస్థలను కళాశాలకు తీసుకువచ్చి విద్యార్థులకు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని డైరెక్టర్ తెలిపారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. రాయుడు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఉద్యోగంలోనూ తమ ప్రతిభను నిరూపించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ మంచి కెరీర్‌ను నిర్మించుకోవాలని సూచించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన శిక్షణ అందించడం ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా కళాశాల ముందుకు సాగుతోందని యాజమాన్యం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *