ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినాయక మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత ఆన్లైన్ అనుమతి వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.
www.ganeshutsav.net ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ శాఖల సమన్వయంతో అనుమతుల ప్రక్రియ నిర్వహించబడుతుంది.
అనుమతి మంజూరైన అనంతరం క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ అనుమతి పత్రం పొందవచ్చు.
ఈ సేవ పూర్తిగా ఉచితం.
సురక్షితమైన, ప్రశాంతమైన, క్రమబద్ధమైన వినాయక చవితి వేడుకల నిర్వహణ కోసం నిర్వాహకులు ఈ ఆన్లైన్ సదుపాయాన్ని వినియోగించుకుని ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
సురక్షిత వేడుకలు – బాధ్యతాయుతమైన వేడుకలు
