మదనపల్లె జూలై 27: (gtvmedia )అన్నమయ్య జిల్లా పాల ఏకరి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కొత్తపల్లి మహేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో పాల ఏకరి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
జిల్లా యువ విభాగం అధ్యక్షుడిగా ఎర్రం హరిబాబు కు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోసు బాబు ఆధ్వర్యంలో నియామకం పత్రలు అందజేసారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ పాల ఏకరి కుల అభివృద్ధితో పాటు బీసీ వర్గాల హక్కుల సాధన కోసం ఇతర నాయకులతో కలిసి నిరంతరం పోరాటం చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో బీసీల హక్కుల కోసం సాగుతున్న ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో అఖిలభారత ఓబీసీ సంఘం కార్యవర్గ సభ్యులు హరిబాబు, కొండపల్లి రవి, డి. రవీంద్ర తదితర నాయకులు పాల్గొన్నారు.
