మదనపల్లి సెప్టెంబర్ 4: శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా మదనపల్లిలోని పలు విద్యాసంస్థల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల జ్ఞానాంబిక విద్యాసంస్థల్లో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థులు కృష్ణుడు విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం ఉట్టి కొట్టే పండుగను కడు వేడుక నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్న ఈ కార్యక్రమం విద్యార్థులకు ఉత్సాహాన్నించింది.

