శ్రావణమాసానికి సన్నాహాలు.. బసినికొండ మెట్ల మార్గం శుభ్రం

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు సేవా కార్యక్రమం

మదనపల్లె, ఆగస్టు 10: (gtvmedia)రానున్న శ్రావణమాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం బసినికొండ మెట్ల మార్గాన్ని హిందూ బంధువులు, వివిధ హిందూ సంఘాల సభ్యులు స్వచ్ఛందంగా శుభ్రం చేశారు.

భజనకొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శ్రావణమాసంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ముందస్తుగా మెట్ల మార్గాన్ని పరిశుభ్రం చేశారు. మెట్ల మార్గంలో పెరిగిన ముళ్లకంపలు, పొదలను తొలగించి భక్తులు సురక్షితంగా ఆలయానికి చేరుకునేలా దారిని శుభ్రం చేశారు.

ఈ సేవా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు, వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొని ఉత్సాహంగా సేవలందించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

శ్రావణమాసంలో ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన హిందూ సంఘాల సభ్యుల సేవలను పలువురు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *