మదనపల్లి : ఆగస్ట్:1 (gtvmedia)సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ నున్నా అనూరాధ
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి బ్యాంకులు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను మరింతగా వినియోగించి ముందుకు రావాలని సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ నున్నా అనూరాధ పిలుపునిచ్చారు.
శనివారం వేంపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదువుతున్న 140 మంది విద్యార్థులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మదనపల్లె శాఖ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు, పెన్నులు తదితర విద్యా సామగ్రితో కూడిన స్టూడెంట్ గిఫ్ట్ ప్యాక్స్ ఉచితంగా పంపిణీ చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ శ్రీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డాక్టర్ నున్నా అనూరాధ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు గిఫ్ట్ ప్యాక్స్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాజిక బాధ్యతకు నిదర్శనమని ప్రశంసించారు. గతంలో కూడా ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన RO ప్లాంట్లను అందించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు, అభినందనీయమని పేర్కొన్నారు. ఇతర బ్యాంకులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల అవసరాల తీర్చడంలో తమ CSR నిధులను వినియోగించాలని కోరారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ శ్రీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, బ్యాంకు దత్తత గ్రామాల్లో గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించడంతో పాటు, స్థానిక అవసరాలకు అనుగుణంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వేంపల్లె గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు విద్యానుబంధ సామగ్రిని అందించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ మేనేజర్ పవన్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ ఛత్రపాల్ రెడ్డి, సమగ్ర శిక్షా కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ కరుణాకర్, మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు శకుంతల, మాధవి, శిరీషా తదితరులు పాల్గొన్నారు.
