మదనపల్లె: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మదనపల్లె రూరల్ మండలం బసినికొండ గ్రామంలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లె ఎమ్మెల్యే యం. షాజహాన్ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మహిళలకు దుస్తులు పంపిణీ చేశారు. ప్రజా సేవా కార్యక్రమాలతో నాయకుల జన్మదిన వేడుకలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, జనసేన కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని నాయకులు తెలిపారు.
