కలెక్టర్ల సదస్సుకు పక్కా నివేదికలు రూపొందించాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లె, ఆగస్టు 24:( gtvmedia)రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.
సోమవారం మదనపల్లె కలెక్టరేట్లో నూతనంగా నిర్మించిన ‘భారత్’ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సెప్టెంబరు 3, 4 తేదీల్లో అమరావతిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో శాఖల వారీగా లక్ష్యాలు, సాధించిన ప్రగతి, 100 రోజుల ప్రణాళిక, విజన్-2047పై సమీక్షించారు.
శాఖల వారీగా చేపట్టిన చర్యలు, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా, పక్కాగా నివేదికలు రూపొందించి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
నూతన సమావేశ మందిరాన్ని ‘Rising, Shining, Strong’ అన్న భావనలకు ప్రతిబింబంగా తీర్చిదిద్దడంలో కృషి చేసిన గృహ నిర్మాణ శాఖ అధికారి రమేష్ రెడ్డి, మాజీ డీపీఆర్ఈఓ చంద్రశేఖర్‌ను కలెక్టర్ అభినందించారు.
