మదనపల్లెలో కోలాహలంగా ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమం

14వ వార్డులో ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరణ

మదనపల్లె, ఆగస్టు 10: (gtvmedia)అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని 14వ వార్డులో ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమం సోమవారం ఉత్సాహంగా కొనసాగింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, మదనపల్లె నియోజకవర్గ పరిశీలకుడు నెట్టెం వెంకటేష్ తదితరులు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించడంతో పాటు, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు.

కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు, చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానం చైర్మన్ గంగారపు నవీన్ కుమార్ చౌదరి, రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకులు రాటకొండ మధుబాబు, బాలుస్వామి, రామ్మూర్తి నాయుడు, మార్పూరి గాంధీ, టౌన్ అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్, రాటకొండ సోము, ప్రతాప్, సాకే కృష్ణమూర్తి,శ్యామలమ్మ, రత్నమ్మ, బూత్ ఇన్‌చార్జ్‌నాగమణి, రాధమ్మ, పులి మహాలక్ష్మి, రాటకొండ భారతి, బైగారి భారతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *