ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ బాధ్యతల స్వీకరణ

తిరుమల: (gtvmedia)తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) నూతన చైర్మన్‌గా నియమితులైన శ్రీధర్ వర్మ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

అంతకుముందు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్న ఆయన.. అనంతరం అలిపిరి సమీపంలోని ఎస్వీబీసీ ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలు, నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు హాజరై శ్రీధర్ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ.. శ్రీవారి ఖ్యాతితో పాటు సనాతన హిందూ ధర్మ విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో ఎస్వీబీసీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఉద్యోగులందరినీ సమన్వయం చేసుకుంటూ ఛానల్‌ను మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.

తనకు ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి శ్రీధర్ వర్మ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *