మదనపల్లె, సెప్టెంబర్ 4: మదనపల్లె పట్టణం శ్రీవారి నగర్ వద్ద శ్రీ కృష్ణ దేవాలయం ఆలయ ట్రస్ట్ చైర్మన్ గురుశంకర్ యాదవ్ ఆధ్వర్యంలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు, అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
మదనపల్లి సమీపంలోని శ్రీవారి నగర్ అనపగుట్ట గోవర్ధనగిరి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఆలయ ట్రస్ట్ చైర్మన్ గురుశంకర్ యాదవ్ ఆధ్వర్యంలోఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు.
ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక అభిషేకం, అర్చన, శ్రీకృష్ణ కళ్యాణోత్సవం, వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తుల ప్రసంగాలు, భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ త్వరలోనే ఆలయానికి రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్న బాబు మాట్లాడుతూ ఆలయానికి కుటుంబ ప్రభుత్వం తరఫున సహకారం కావాలన్నా తన వంతు ఎప్పుడు కృషి చేస్తానని తెలిపారు కృష్ణాష్టమి వేడుకల్లో
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మదనపల్లి డిఎస్పీ బుచ్చిరాజు గారి ఆధ్వర్యంలో, టూ టౌన్ సిఐ మహమ్మద్ రఫీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మదనపల్లి శాసన సభ్యులు షాజహాన్ బాషా, తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే ఇంచార్జ్ జి. శంకర్ యాదవ్, బిజెపి నాయకులు బండి ఆనంద్, జర్మనీ రాజు, విజయ భారతి స్కూల్ అధినేత సేతు, కనుగొండ మద్దిరెడ్డి, కురవంక మాజీ సర్పంచ్ చలపతి, టౌన్ బ్యాంక్
చైర్మన్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది..
