దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

మదనపల్లె, ఆగస్టు 15:( gtvmedia)80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మదనపల్లిలోని ఎంపీడీవో కార్యాలయం, టౌన్ బ్యాంక్ సర్కిల్, కార్పొరేషన్, మున్సిపల్ కార్యాలయం, ఉర్దూ పాఠశాల, జడ్పీ హైస్కూల్, మహిళా జూనియర్, డిగ్రీ కళాశాల, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, టిప్పు సుల్తాన్ మైదానం, బి.టీ. కళాశాల తదితర ప్రాంతాల్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ జెండాకు వందనం తెలిపారు.

దేశం కోసం ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు.

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ.. మనమంతా కలిసికట్టుగా కులమతాలకు అతీతంగా ఐక్యతతో ఉంటూ దేశ అభివృద్ధికి కృషి చేయాలని, దేశ ఔన్నత్యాన్ని మరింత పెంచేలా ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *