పొన్నమండ లక్షణ స్వామి వర్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు

మదనపల్లె, ఆగస్టు 7:(gtvmedia)

అన్నమయ్య జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం శ్రీ పొన్నమండ లక్షణ స్వామి వర్మ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారిత అధికారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి పి. తేజస్విని మాట్లాడుతూ.. శ్రీ పొన్నమండ లక్షణ స్వామి వర్మ గారి జీవితం, సేవలు మరియు సమాజానికి ఆయన అందించిన విశిష్ట కృషిని స్మరించుకున్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం, విద్యా ప్రగతి, సమాన అవకాశాల సాధన కోసం ఆయన చూపిన మార్గదర్శకత్వం ఆదర్శప్రాయమని అధికారులు పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, స్వాభిమానం మరియు విద్యాభివృద్ధి పెంపొందించడంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమానికి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారిత అధికారి పి. తేజస్విని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పొన్నమండ లక్షణ స్వామి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో రాయలసీమ అగ్నివన్నెకుల క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు ఎ. బలరాం, ట్రెజరర్ కె. గోపికృష్ణ, తంబళ్లపల్లి నియోజకవర్గ అధ్యక్షులు జయరాం, పీలేరు మండల అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షురాలు ఆర్. ఇందుమతి, అన్నమయ్య జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘ నాయకులు, సంఘ ప్రతినిధులు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *