ప్రభుత్వ భూములను కాపాడండి

మదనపల్లె, ఆగస్టు 25: (gtvmedia)మదనపల్లి మండలం
తట్టివారిపల్లిలో ప్రభుత్వ భూముల వివాదం – జిల్లా కోర్టులో కేసు నమోదు (O.S. No. 632/2026)
మదనపల్లె మండలం, తట్టివారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ ఉన్న విలువైన ప్రభుత్వ / పంచాయతీ భూములను అక్రమ ఆక్రమణదారుల నుండి కాపాడాలని బహుజన యువసేన (BYS) అధ్యక్షులు పునీత్ కుమార్ కోరారు. మంగళవారం అన్నమయ్య జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ ను కలసిన పునీత్ మాట్లాడుతూ..గతంలో
ఈ భూములకు సంబంధించి అక్రమ ఆక్రమణలను అడ్డుకోవడానికి జిల్లా కోర్టులో అధికారికంగా O.S. No. 632/2026 నెంబర్ తో కేసు నమోదు కావడం జరిగిందన్నారు. కేవలం కోర్టు కేసులతో సరిపెట్టకుండా, ఆ భూములను పూర్తిగా పరిరక్షించడానికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

​ భూములు ప్రభుత్వ/పంచాయతీకి చెందినవని తెలుపుతూ తక్షణమే హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.
​ఆ భూముల్లోని అక్రమ నిర్మాణాలను తొలగించలని, .
​కోర్టులో కొనసాగుతున్న O.S. No. 632/2026 కేసులో పంచాయతీకి అనుకూలంగా గట్టి వాదనలు వినిపించి, తగిన న్యాయపరమైన చర్యలు తీసుకోవాళ్లన్నారు.
​ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని పునీత్ కుమార్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *