సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు MLA షాజహాన్ బాషా

మదనపల్లె, ఆగస్టు 25:( gtvmedia)మండల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మదనపల్లె ఎమ్మెల్యే యం. షాజహాన్ బాషా సూచించారు.

మదనపల్లె మండల కార్యాలయ సమావేశ మందిరంలో నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌ అధికారులు, స్పెషల్‌ ఆఫీసర్లతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సమీక్ష నిర్వహించారు.

ఎలినో నేపథ్యంలో తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోర్లు డ్రిల్‌ చేయించడం, పనిచేయకుండా ఉన్న బోర్లను వెంటనే మరమ్మతులు చేయించడం ద్వారా సమస్యను పరిష్కరించాలని సూచించారు.

అదేవిధంగా డ్రైనేజీలు, సీసీ రోడ్లు, విద్యుత్‌ సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమీక్షలో మదనపల్లె తహసీల్దార్‌ తాజ్‌ మసూర్‌, రామసముద్రం ఎంపీడీవో లతీఫ్‌ ఖాన్‌, డిప్యూటీ ఎంపీడీవోలు అన్నపూర్ణ, కృష్ణవేణి, నిమ్మనపల్లె ఏవో రమేష్‌బాబు, డిప్యూటీ ఎంపీడీవో బాలరాజు, మదనపల్లె డిప్యూటీ ఎంపీడీవో తిరుపాల్‌ నాయక్‌, భారతి, ఆర్‌డబ్ల్యూడీ ఈఈ రెడ్డప్ప, పంచాయతీరాజ్‌ డీఈ మహమ్మద్‌ గౌస్‌, ఇరిగేషన్‌ ఏఈ రాయల్‌బాబు, పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్‌ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *