లక్కిరెడ్డిపల్లిలో 6 ఎర్రచందనం దుంగలు పట్టివేత

5 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్.. కారు స్వాధీనం

అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం బి.ఎర్రగుడి గ్రామం చెంచర్లపల్లి వద్ద పోలీసులు 6 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. ఈ ఘటనలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్టైన నిందితులు అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి ఎర్రచందనం దుంగలతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌లో రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ మీడియాకు వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *