త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన నాయకులు
మదనపల్లె, ఆగస్టు 8: (gtvmedia)గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన సీనియర్ రిపోర్టర్ యుగంధర్ (చిన్న) ఇటీవల డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు శనివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా యుగంధర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నాయకులు, ఆయనకు ధైర్యం చెప్పారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సీనియర్ రిపోర్టర్ యుగంధర్ త్వరగా కోలుకుని తిరిగి తన వృత్తి విధుల్లో చురుగ్గా పాల్గొనాలని గంగారపు రాందాస్ చౌదరి, శ్రీరామ్ చినబాబు ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో యాలగిరి దొరస్వామి నాయుడు, మెహబూబ్ ఖాన్, జాఫర్, జేసీ రెడ్డప్ప తదితరులు పాల్గొని యుగంధర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
