పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మస్తానయ్య..

మదనపల్లి, జులై 31(gtvmedia): లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తూ 33 ఏళ్ల సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొందిన సి. మస్తానయ్యకు జిల్లా పోలీసు శాఖ శుక్రవారం ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికింది. మదనపల్లెలోని జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ముఖ్య అతిథిగా హాజరై, మస్తానయ్యను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. ఒత్తిడితో కూడిన పోలీసు వృత్తిలో ఇన్నేళ్ల పాటు అంకితభావంతో, క్రమశిక్షణతో ప్రజలకు విశేష సేవలందించడం అభినందనీయమన్నారు. ఆయన తదుపరి జీవితం ఆయురారోగ్యాలతో, సంతోషంగా సాగాలని ఆకాంక్షిస్తూ, పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సత్వరమే అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. తనను ఆత్మీయంగా సత్కరించిన ఎస్పీ గారికి ఏఎస్ఐ మస్తానయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి గారు, ఏఆర్ డీఎస్పీ డి.ఏడుకొండల రెడ్డి గారు, ఆర్ఐ రవికుమార్ గారు, ఇతర అధికారులు, సిబ్బంది ఏఎస్ఐ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *