మదనపల్లి ఆగస్టు 4 : (gtvmedia)ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడానికి సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్రను ప్రజలు విజయవంతం చేయాలని, సిపిఐ నాయకులు కోరారు. మంగళవారం స్థానిక ఎస్టియు కార్యాలయంలో సిపిఐ నాయకులు మాట్లాడుతూ.. ఈనెల ఆరవ తేదీ గురువారం మదనపల్లె కు సిపిఐ సీనియర్ నాయకులు నారాయణతో పాటు, పలువురు రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారు అన్నారు. మదనపల్లి పట్టణంతోపాటు మన పాదయాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కృష్ణప్ప, సాంబశివ, మురళి తదితరులు పాల్గొన్నారు
సిపిఐ నాయకుల పాదయాత్రను విజయవంతం చేయండి
