తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమల, ఆగస్టు 27: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.

భక్తుల రద్దీతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. దీంతో భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకోవడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.

నిన్న 77,568 మంది భక్తుల దర్శనం

బుధవారం (ఆగస్టు 26) శ్రీవారిని మొత్తం 77,568 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే రోజు 35,033 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

శ్రీవారి హుండీకి రూ.4.19 కోట్ల ఆదాయం సమకూరింది.

భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తు ప్రణాళికతో రావాలని, టీటీడీ సూచనలు పాటిస్తూ సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

ఓం నమో వేంకటేశాయ 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *