మదనపల్లిలో వేగంగా సాగుతున్న సీటీఎం రోడ్డు విస్తరణ పనులు

మదనపల్లె, ఆగస్టు 27: మదనపల్లి పట్టణంలో కొనసాగుతున్న సీటీఎం రోడ్డు విస్తరణ పనులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా పరిశీలించారు.

పనులు జరుగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే.. రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సూచించినట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులను పూర్తి చేయాలని సూచించారు.

రోడ్డు విస్తరణ పూర్తయితే పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు రోడ్డు విస్తరణకు సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *