మదనపల్లె, ఆగస్టు 27: (gtvmedia)మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపిన వ్యక్తికి మదనపల్లి న్యాయస్థానం రూ.11,000 జరిమానాతో పాటు రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.
సత్యసాయి జిల్లా తనకల్లు ప్రాంతానికి చెందిన బి. రాజశేఖర్ నాయక్ (42) ఈ నెల 20న మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో మదనపల్లి టూ టౌన్ పోలీసులు అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
కేసు వివరాలు
ఈ ఘటనకు సంబంధించి క్రైమ్ నంబర్ 189/2026 (20-08-2026), STC నంబర్ 2082/2026 కింద కేసు నమోదైంది. నిందితుడిపై BNS సెక్షన్ 275, మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 185 కింద అభియోగాలు నమోదయ్యాయి.
కేసును విచారించిన స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్, మదనపల్లి న్యాయస్థానం నిందితుడు దోషిగా నిర్ధారించడంతో రూ.11,000 జరిమానా, రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.
డ్రంక్ అండ్ డ్రైవింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని మదనపల్లి టూ టౌన్ పోలీసులు ప్రజలకు సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా తమతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
