మదనపల్లి, ఆగస్టు 12: (gtvmedia)అమరావతి ఛాంపియన్‌షిప్ బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొనే అండర్-23 చిత్తూరు జిల్లా పురుషుల జట్టుకు మదనపల్లికి చెందిన విద్యార్థి దిత్విక్ వెంకటేష్ ఎంపికయ్యాడు.
మదనపల్లి సమీపంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్న దిత్విక్ వెంకటేష్.. సోమవారం పలమనేరులో నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్ అండర్-23 బాస్కెట్‌బాల్ పురుషుల జట్టు ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు.
గుంటూరులో 12 రోజుల పాటు నిర్వహించనున్న అమరావతి ఛాంపియన్‌షిప్ అండర్-23 బాస్కెట్‌బాల్ పురుషుల పోటీల్లో చిత్తూరు జిల్లా జట్టు తరఫున దిత్విక్ వెంకటేష్ పాల్గొననున్నాడు.
విద్యార్థి ఎంపిక కావడం పట్ల కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎస్. రామలింగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దిత్విక్ వెంకటేష్‌ను అభినందిస్తూ క్రీడల్లో మరింత నైపుణ్యాన్ని సాధించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల కన్వీనర్ ఆర్. సురేంద్రబాబు, ఎస్. జబీఉల్లా భాష తదితరులు పాల్గొన్నారు.
