మదనపల్లి, ఆగస్టు 6:( gtvmedia)జూలై-2026 నెలలో రీజియన్‌లో అత్యధిక ఆదాయం, అత్యుత్తమ కిలోమీటర్లకు ఇంధన వినియోగ సామర్థ్యం (KMPL) సాధించి ప్రతిభ కనబరిచిన మదనపల్లి-1 డిపో గ్యారేజ్, ట్రాఫిక్ విభాగాల ఉద్యోగులను గురువారం డిపోలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభలో ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు.
సిబ్బంది సమిష్టి కృషి, క్రమశిక్షణ, విధి నిర్వహణ పట్ల అంకితభావంతో పనిచేయడం వల్లే జూలై నెలలో డిపోకు ఈ స్థాయి ఫలితాలు సాధ్యమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి సంస్థకు మరింత పేరు తీసుకురావాలని ఉద్యోగులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆగస్టు-2026 నెల లక్ష్యాలను కూడా డిపో మేనేజ్‌మెంట్ ప్రకటించింది. EPK 55.00, Occupancy Ratio (OR) 100 శాతం, KMPL 5.50 లక్ష్యాలను తప్పకుండా సాధించేందుకు ప్రతి ఉద్యోగి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డిపో మేనేజర్‌తో పాటు అధికారులు, గ్యారేజ్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
