సిటిఎం రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా

మదనపల్లె, ఆగస్టు 29:( gtvmedia)మదనపల్లె పట్టణంలోని సిటిఎం రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా శనివారం పరిశీలించారు. స్థానిక నాయకులతో కలిసి పనులు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి, అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిటిఎం రోడ్డు విస్తరణ పనులకు స్థానిక వ్యాపారులు సహకరించాలని కోరారు. రోడ్డు అభివృద్ధి పూర్తయితే మదనపల్లె పట్టణ రూపురేఖల్లో గణనీయమైన మార్పు వస్తుందని పేర్కొన్నారు.

అభివృద్ధి పనులకు సహకరిస్తున్న వ్యాపారులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. పనులు సజావుగా కొనసాగేందుకు ప్రజలు, వ్యాపారులు అధికారులకు సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *