మదనపల్లి 6వ వార్డులో టీడీపీ–జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం: ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా, రాయలసీమ జనసేన కోఆర్డినేటర్ రామదాస్ చౌదరి పాల్గొన్నారు

మదనపల్లి, ఆగస్టు 6: (gtvmedia)మదనపల్లి పట్టణంలోని 6వ వార్డులో రాటకొండ సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన టీడీపీ–జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశానికి మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా, జనసేన పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్ రామదాస్ చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్థానిక కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా చేరవేయడం, రానున్న కార్యక్రమాల్లో సమన్వయంతో పనిచేయడం వంటి అంశాలపై చర్చించారు.

కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర కీలకమని నాయకులు పేర్కొన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, టౌన్ బ్యాంకు చైర్మన్ n విద్యాసాగర్,గంగారపు నవీన్ చౌదరి షంషీర్ RS,తులసి రామకృష్ణ బాలుస్వామి ,బాబ్జీ ,సహదేవ నాయుడు ,రాటకొండ భారతి,చిన్ని ,పులమురళి ,వినోద్ ,నాగమణి ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *